18, ఆగస్టు 2009, మంగళవారం

స్నిగ్ధ కౌముది



బ్లాగ్మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రణీతస్వాతి. చాన్నాళ్ళుగా ఒక బ్లాగ్ తెరవాలని కోరిక. సరే! కాని..బ్లాగ్ తెరవాలంటే ముందుగా దానికి నామకరణం చెయ్యాలి కదా. మరి నామకరణం చెయ్యాలంటే పేరు కావాలి కదా, అందుకని కొన్నాళ్ళుగా పేరు వెతికే పనిలో పడ్డాను. కూర్చున్నా, నిల్చున్నా, ఏ పనిలో వున్నా అదే ధ్యాస.

బంధువుల్ని, స్నేహితుల్ని, ఆఖరికి కేవలం ముఖపరిచయం ఉన్న వాళ్ళని కూడా మంచి పేరు సూచించమని అడగడం మొదలెట్టా. తరవాత్తరవాత వాళ్ళందరూ నన్ను చూసి హడలిపోయి ముఖం చాటేయడం మొదలెట్టారు. అయినా సరే పట్టు వదలకుండా కనపడ్డవారినల్లా నా బ్లాగ్ పేరు కోసం వేధించా (ఛ..నేను చాలా మంచి దాన్ని).

ఇంత కష్టపడ్డా మంచి పేరు దొరక్కపోయే సరికి బాగా కోపమొచ్చింది అందరి మీదా. నా బ్లాగ్ పేరు నేనే వెతుక్కోవాలని నిర్ణయించుకున్నా. ఆలోచించడం మొదలెట్టా. సినిమాల్లోలా రకరకాల భంగిమల్లో ఆలోచించా.

చాలా రోజుల క్రితం చదివిన ఏదో నవలలో (పేరు గుర్తులేదు) నాయిక పేరు "స్నిగ్ధ" గుర్తొచ్చింది. కానీ ఇంకా ఏదో అసంపూర్తిగా వున్నట్టు భావన. మొన్న పదిహేనురోజులనాడు మా మావయ్య వాళ్ళింట్లో గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు అక్కడొక అమ్మాయి తన పేరు "కౌముది" అని ఎవరికో చెప్తోంటే విన్నాను. బాగుందనిపించింది.

కానీ నిజం చెప్పద్దూ..కౌముది అంటే అర్ధం ఏంటో తెలీదు నాకు. ఆ మాట బైటికి అంటే అమ్మో ఇంకేమైనా వుందా? అందరూ నవ్వరూ! అందుకే ఇంటికి రాగానే ముందు "శబ్ద రత్నాకరం" తెరిచాను. "స్నిగ్ధ" కి "కౌముది" కి అర్ధాలు వెతుక్కున్నాను. మంచి రోజు చూసుకుని దేముడికి బాగా దండం పెట్టుకుని నా బ్లాగ్ కి "స్నిగ్ధకౌముది (చిక్కని వెన్నెల)" అని నామకరణం చేసేశాను.

ఇవండీ నా బ్లాగ్ నామకరణ మహోత్సవ విశేషాలు. బ్లాగ్ మిత్రులందరూ నా బ్లాగ్ ని ఆశీర్వదించి, నా ఈ స్నిగ్ధకౌముదిని అందరూ ఆస్వాదించాలని నా కోరిక.



18 కామెంట్‌లు:

మురళి చెప్పారు...

చక్కని ప్రారంభం.. అబినందనలు.. మీరు రాసే టపాల కోసం ఎదురు చూస్తూ...

సిరిసిరిమువ్వ చెప్పారు...

అభినందనలు. ఎలా వ్రాయాలి ఎలా వ్రాయాలి అంటూ బాగానే వ్రాసేసారు. మీ భావ వ్యక్తీకరణ చక్కగా ఉంది, మరిన్ని టపాల కోసం ఎదురుచూస్తుంటాము.

Hima bindu చెప్పారు...

మీ బ్లాగ్ పేరు బాగుంది,మీరు బ్లైండ్ గా పేరు పెట్టకుండా అర్ధం వెదికి చెప్పడం బాగుంది ...అల్ ది బెస్ట్ అండీ...మీలాటి కొత్త వాళ్ళం చాలమందిమే వున్నాం .

ప్రణీత స్వాతి చెప్పారు...

మురళి : అంతా మా గురువుగారి దయండి..ధన్యవాదాలు.
చిన్ని : ధన్యవాదాలండి.
సిరి సిరి మువ్వ : మా గురువుగారి చలవ వల్ల, మీలాంటి మిత్రుల సహకారం వల్ల.. ఇలా ప్రయత్నం మొదలెట్టానండి.

Sravya V చెప్పారు...

ఓ ప్రణీత గారు బ్లాగు మొదలు పెట్టేసారా ? వ్రాసేయండి మరి !

బ్లాగాగ్ని చెప్పారు...

స్నిగ్ధకౌముది ...! చాలా మంచి పేరండీ. బ్లాగులోకానికి స్వాగతం.

ప్రణీత స్వాతి చెప్పారు...

శ్రావ్య: అవునండి మొదలెట్టేసాను..

ప్రణీత స్వాతి చెప్పారు...

బ్లాగాగ్ని: ధన్యవాదాలండి

శేఖర్ పెద్దగోపు చెప్పారు...

అయ్యబాబోయ్...బ్లాగు పేరు కోసం ఇంతలా ఆలోచించారా? బాగుంది బ్లాగు పేరు. అలాగే టెంప్లేట్ కూడా మార్చడానికి ప్రయత్నించండి. ఏమీ రాయాలేనంటూనే బాగానే రాసారు...అభినందనలు.

ప్రణీత స్వాతి చెప్పారు...

శేఖర్ : అలాగేనండి, ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

ayya baboi...

ప్రణీత స్వాతి చెప్పారు...

అజ్ఞాత : ధన్యవాదాలు.

కొత్త పాళీ చెప్పారు...

ఇన్నాళ్ళూ స్నిగ్ధ అంటే శుద్ధమైన, అమలినమైన అనుకుంటూ వచ్చాను. మీ బ్లాగు తెరవంగానే స్నిగ్ధకౌముది అని పేరు చూసి, అమలిన వెన్నెల కాకుండా మలినమైన వెన్నెల కూడా ఉంటుందా అని నవ్వుకున్నా. తీరా మీ యీ వివరణ చదివాక నా అజ్ఞానాంధకారము పటాపంచలైనది. బాగుంది పేరు. మీ రాతలు కూడా బాగున్నై.

ప్రణీత స్వాతి చెప్పారు...

@ కొత్త పాళీ: ధన్యవాదాలండీ..నా బ్లాగ్ చదివి వ్యాఖ్య రాసి నాలో బెరుకు పోగొట్టారు.

జాన్‌హైడ్ కనుమూరి చెప్పారు...

all the best

చందు చెప్పారు...

emoamri naku telisinantha paraijanam lo koumudi ante "vudaharana" ani telusu ,meremo vennela antunnaru...yamini nate vennela emo kada ! sandeham nivruthinchagalaru

ప్రణీత స్వాతి చెప్పారు...

@ సావిరహే గారూ: ముందుగా ధన్యవాదాలండీ నా టపాలనీ చదివినందుకు.. వ్యాఖ్య రాసినందుకు. ఇకపోతే శబ్ద రత్నాకరం లో అర్ధాలు వెతుక్కున్నాకే ధైర్యం చేశానండీ నా బ్లాగ్ కి ఆ పేరు పెట్టుకోడానికి.

గిరీష్ చెప్పారు...

oho snigdha koumudhi ante chikkani vennela la na..bagundandi..ina peru pettadaaniki antha sepu vethiki vadabosarante greate..:-)..nenu na tapaa rastunnappudu edo picchi picchi ga rastu..neninthe ani peru pettesa..malli raviteja cinema peru anukuntaremo nani tag line kuda athikincha..:-)..nyways thanks for the meaning.