23, ఫిబ్రవరి 2011, బుధవారం

పూవై విరిసిన...



కేవలం..బేలా అన్న ఆ ఒక్క మాట కోసం ఈ పాటని కొన్ని వేల సార్లుగా వింటూనే వున్నాను..అంటే నమ్ముతారా..? అతిశయోక్తిలా అనిపిస్తోంది కదూ..కానీ అక్షరాలా నిజం. 

చాలా కాలం క్రితం టీవీ లో ఒక లైవ్ షో లో ఈ పాట విన్నాను(చూశాను). ఆ తరువాత కనిపించిన ప్రతీ చిన్న, పెద్ద మ్యూజిక్ స్టోర్ లు వెతికాను పిచ్చిగా...చివరికి సంగీత్ సాగర్ లో "గోల్డెన్ హిట్స్ అఫ్ ఘంటసాల" లో పట్టుకున్నాను. అప్పటినించీ మనసారా..తనివి తీరా విన్నాను..వింటూనే వున్నాను..ఆనందిస్తూనే వున్నాను.

మా ఫ్రెండ్ వాళ్ళ అక్క భర్త సి.హెచ్.సురేష్ అని బ్యాంకు ఉద్యోగి..ఘంటసాల గారి పాటలు, మాధవపెద్దిగారి పాటలు (అందుకే ఈయన మాధవ పెద్ది గారి కుటుంబానికి చాలా సన్నిహితుడయ్యాట్ట) టీవీ లలో, స్టేజి షో లలో పాడుతూ వుంటారు.. మొన్నామధ్య కాస్త తీరికగా కనిపిస్తే అడిగి పాడించుకున్నాను ఈ పాట. అద్భుతంగా పాడారు. నాకీ పాట ఎందుకిష్టమో చెప్తే విని ఆశ్చర్య పోయారు అలా కూడా ఉంటారా (వింటారా) అంటూ..


సుతి మెత్తగా..మృదు మధురంగా సాగే ఈ పాట..శ్రీ తిరుపతమ్మ కధ సినిమాలోనిది. సి. నారాయణరెడ్డి గారు రాసి శంకర్ , పామర్తి గార్లు సంగీతాన్ని అందించగా..మనకోసమే గంధర్వ లోకం నించి వచ్చి తన గళం తో పాటల పూలు పూయించి తిరిగి అదే లోకానికి వెళ్ళిపోయిన ఘంటసాల గారు పాడగా విరిసిన పువ్విది. 






పూవై విరిసిన పున్నమి వేళ..
బిడియము నీకెలా..బేలా..!!పూవై!! 


చల్లని గాలులు సందడి చేసే..
తోలి తోలి వలపులు తొందర చేసే..
జలతారంచుల మేలిముసుగులో 
తలను వాల్తువేలా..బేలా..!!పూవై!!



మొదట మూగినవి మొలక నవ్వులు..
పిదప సాగినవి బెదరు చూపులు..ఆ..ఆ..ఆ..
తెలిసెనులే నీ తలపులేమిటో...
తొలగిపోదువేలా...బేలా !!పూవై!!



తీయని వలపుల పాయసమాని..
మాయని మమతల ఊయలలూగి..
ఇరువురమొకటై పరవశించగా..
ఇంకా జాగేలా..బేలా!!పూవై!!



10 కామెంట్‌లు:

Padmarpita చెప్పారు...

మంచి మధురగీతం!

♥♥♥$υяєรн мσнคи♥♥♥ చెప్పారు...

ఇంతకు ముందు విన్నా కానీ ఎప్పుడు "బేలా" ని సరిగా గమనించలేదు .. మీ post చూసేవరకూ ... ఇదే పాటని లీలాగారు విషాదంగా ఆలపించారు ...

"పూవై విరిసిన పున్నమి వేళ ... నా కనులందే చీకటులేల...
చల్లని గాలుల సందడి ఏది..
తొలి తొలి వలపుల తొందర ఏది..
ముసుగుతీసి నా మోమునిమిరిన మోహనరూపమేది.."

హితుడు చెప్పారు...

patalni ila kuda vintarani ippude telisindi,,,,,

lakshmana kumar malladi చెప్పారు...

నా ప్రశ్న గురించి మీరు సమాధానం రాయనే లేదు. ఇస్తె, మీకు మంచి మంచి పాటలు/స్తొత్రాలు వినిపించగలను. దయచేసి రాయరూ!!

ప్రణీత స్వాతి చెప్పారు...

@ మల్లాది లక్ష్మణ కుమార్ : ముందుగా స్నిగ్ధ కౌముది కి విచ్చేసినందుకు ధన్యవాదాలు. పాటలు ఎలా అప్ లోడ్ చెయ్యాలి అనే విషయం లో బ్లాగ్ మిత్రులొకరు నాకు చెప్పిన సలహా మీ కోసం..

మీ కంప్యూటర్లో ఉన్న పాటలు ముందుగా ఆడియో ఫైల్స్ హోస్ట్ చేయగలిగిన సైట్స్‌ని ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు www.divshare.com అనే సైట్ ఒకటి అలాంటిది.

దీన్లో మీరు మామూలుగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మీ వివరాలు అవీ ఇచ్చి రిజిష్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా మీ అకౌంట్‌లోకి వెళ్ళి మీకు కావలసిన ఆడియో ఫైల్స్ ని అప్‌లోడ్ చేసుకోవాలి.

ఫైల్స్ అన్నీ అప్లోడ్(upload) అయిన తర్వాత ప్రతీ ఫైల్ క్రిందన embed అనే ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే మీకు కోడ్ వస్తుంది. యూట్యూబ్ వీడియో కోడ్ లాగ అన్నమాట. దాన్ని మీరు మీ టపాలో కావలసిన చోట కాపీ చేసుకోవచ్చు. మీరు టపా పబ్లిష్ చేసిన తర్వాత ఆడియో ఒకటి కనిపిస్తుంది. అంతే..

ఇక వీడియోల విషయానికి వస్తే, వీడియోని కూడా పైన చెప్పిన సైట్లో అప్లోడ్ చేసి, embed కోడ్ తీసుకోవాలి...అయితే వీడియోలకి ఈ సైట్ కంటే యూట్యూబ్ సైట్లో పెడితే అందరికీ అందుబాటులో ఉంటుంది.

దీని కోసం మీరు యూట్యూబ్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి...తర్వాత మీ అకౌంట్‌లో అప్లోడ్ ఆప్షన్ ద్వారా వీడియోని అప్లోడ్ చేసి ఎంబడ్ కోడ్ తీసుకుని, టపాలో పెట్టేయటమే.

యూట్యూబ్లో అకౌంట్ లేకపోయినా వీడియోని అప్లోడ్ చేయొచ్చు..నిర్వహణ తేలికగా ఉండటం కోసం మన యూట్యూబ్ అకౌంట్లో వీడీయో పెట్టుకుంటే బాగుంటుంది..

కంది శంకరయ్య చెప్పారు...

స్వాతి గారూ,
నేనొకసారి ప్రయత్నించాను కాని సఫలం కాలేదు. ఎక్కడ ఏలోపం చేసానో? మరోసారి ప్రయత్నిస్తా.
అన్నట్టు "పూవై విరిసిన" పాట నాకుకూడా ఎంతో ఇష్టం.

అజ్ఞాత చెప్పారు...

...బేలా.. ముందు, తరువాత విరుపు ఘంటసాల అద్భుతంగా విరిచారు, సినారె చక్కగా విరచించారు. నాకు చిన్నప్పటి నుండి ఇష్టమైన పాట గుర్తు చేశారు.
పిక్చరైజేషన్ కూడా బాగుంటుంది, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఎక్కడైనా విడియో లింకు కనిపిస్తే దయచేయండి. :)

రాజేష్ జి చెప్పారు...

$SNKR Ji

This is for you :)

http://www.youtube.com/watch?v=ph7yYe4VfSg

Let me know If the quality is not apt.

అజ్ఞాత చెప్పారు...

Thanks a lot, Rajesh.

krsna చెప్పారు...

modati sari vinnaanu ee song. bavundi. Thank u and nice post.