1, ఫిబ్రవరి 2011, మంగళవారం

గూటినున్న రామచిలుక గువ్వల పాలాయెరన్నా..


ఏ మహానుభావుడు రాశాడో ఇంత మంచి తత్వాన్ని, ఇంత గొప్ప సత్యాన్ని.  రెప్పపాటు జీవిత కాలం లో...నా అంత వీరుడు లేడని గొప్పలు పోతాం... అంతా నా ప్రతిభే...అన్నీ నా సొంతమే అనుకుంటాం.  శరీరమనే ఈ గూటి నించి ప్రాణమనే రామచిలుక ఎగిరిపోయాక...  కేవలం స్మృతి గా మిగిలిపోతాం. 

ఎంత వద్దనుకున్నా..ఈ మధ్యకాలంలో నేను కోల్పోయిన బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల జ్ఞాపకాలు విపరీతంగా బాధ పెడుతున్నాయ్.  జీవితం  క్షణ  బంగురం  అని అనుకునే  స్థితప్రజ్ఞత  ఎప్పుడొస్తుందో..







గూడు చిన్న బోయెరా..చిన్నన్నా గూడు చిన్న బోయెరా..
గూటినున్న రామచిలుక గువ్వల పాలాయెరన్నా.. !!గూడు!!

ఎక్కలేని పర్వతాలు..వేయి నూర్లు నిచ్చెనేసినా..
ఎక్కడ చూచినా గానీ చిలక జాడ కాన రాదు..!!గూడు!!

పంచ పరమాన్నములు పళ్ళెములో పోసి ఇచ్చినా..
మాణిక్యం చేతికిచ్చినా మాటలాడదు రామ చిలుక !!గూడు!!

కొండ మీద బండి వాలేను..గుండె రెండు చెక్కలాయెను..
గూటినున్న రామచిలుక గువ్వల పాలాయెరన్నా.. !!గూడు!!



6 కామెంట్‌లు:

జయ చెప్పారు...

అప్పుడే ఇంత వేదాంతమా! పూర్తిగా స్థితప్రజ్ఞులు ఉండగలరా అన్నది నా అనుమానం. బుద్భుదప్రాయమైన జీవితంలోనే గా భవసాగరాలు ఉండేది. తామరాకు మీది నీటిబొట్టు లాగ ఉండగలిగితేనే స్థితప్రజ్ఞత ఏర్పడుతుందనుకుంట. చెప్పటం సులభమే, కాని ఏమీ తోచటం లేదు.

veera murthy (satya) చెప్పారు...

మీ పాటకి బాణీ కడితే చాలా బాగుంటుంది....
ఏరు దాటే పడవ ప్రయానం లా...

చాలా బాగారాసారు...ధన్యవాదాలు.

ప్రణీత స్వాతి చెప్పారు...

@ జయ : స్థితప్రజ్ఞులు వుండే వుంటారండీ.

@ సత్య : ఈ పాట రాసింది నేను కాదండి. ఎవరో మరి ఆ మహానుభావుడు. ఆ పాటకి బాలమురళి కృష్ణ గారు తన గాత్ర దానం చేశారు. వినడానికి వీలుగా ప్లేయర్ కూడా ఉంచాను. మీరు వినలేదా? ఒకసారి వినండి చాలా బాగుంటుంది.

సుమలత చెప్పారు...

బాగుందండి చాలా బాగా అమర్చారు.....

veera murthy (satya) చెప్పారు...

నిజమే నండి...తరువాత బుర్ర గోక్కున్నాను...


క్రింద "రాసిన వారు.. ప్రణీత స్వాతి" అని ఉంటేనూ అలా అనుకున్నాను..

కాని పాట చాలా బాగుందoడి.


http://neelahamsa.blogspot.com/2011/02/blog-post_17.html

మురళి చెప్పారు...

నాకు బాగా నచ్చిందండీ..