13, జనవరి 2011, గురువారం

గాయతి వనమాలీ



బ్లాగ్ మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు...


నేనండీ ప్రణీత స్వాతిని. గుర్తున్నాను కదూ(అమ్మయ్య థాంక్ యు)..చాలా కాలం తరవాత మళ్ళీ బ్లాగ్ లోకం లో అడుగుపెట్టే అవకాశం దొరికింది. సంక్రాంతి పండగ కదా అందరినీ విష్ చేసినట్టుంటుందని వచ్చాను. 


గత కొద్ది నెలలుగా విపరీతమైన ఒత్తిడిలో వున్న నన్ను సేదతీర్చినవి పాటలే.  అందులో "గాయతి వనమాలీ" అనే ఈ సదాశివ బ్రహ్మేంద్ర కృతి ఎంతమంది గాయకులో పాడారు.  కానీ...నాకెంతో ఇష్టమైన గాయకుడు డా. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పాడిన ఈ శైలి నాకు చాలా ఇష్టం.  నాకిష్టమైన ఈ పాట మీరూ వినాలని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. సంస్కృతం లో వున్న ఈ పాటకి ఎవరైనా అర్ధం చెప్పగలిగితే ధన్యురాలిని.  ఏవైనా అచ్చు తప్పులుంటే మన్నించమని ప్రార్ధన. 






పల్లవి!!  గాయతి వనమాలి - మధురం - గాయతి వనమాలి!! 
చరణం!! పుష్ప సుగంధ సుమలయ సమీరే
             
పావన ముని జన యమునా తీరే  !! గాయతి !!  

చరణం!! కూజిత శుక పిక ముఖ ఖగ కుంజే
             
కుటిలాలక బహు నీరద పుంజే || గాయతి ||  

చరణం!! తులసి ధామ విభూషణ హారీ
              
జలజ భవ స్తుత సద్గుణ శౌరీ  !! గాయతి !!

చరణం!! పరమ హంస హృదయోత్సవ కారీ…      హరీ హరీ 
           
పరిపూరిత మురళీ.. రవ ధారి   !! గాయతి!!  






8 కామెంట్‌లు:

జయ చెప్పారు...

హాయ్ ప్రణీతస్వాతి, బాగున్నారా. చాలా మంచిపాటతో మళ్ళీ పలకరించారు. ఇంక రోజూ వస్తారు కదూ. మీకు కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు.

Sai Praveen చెప్పారు...

ప్రణీత గారూ,
ఎలా ఉన్నారు? పెద్ద విరామమే తీసుకున్నారు.
చాలా రోజుల తరువాత పలకరిస్తూ మంచి పాటను పరిచయం చేసారు. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

గిరీష్ చెప్పారు...

స్నిగ్ధకౌముది ante ardam entandi?

ప్రణీత స్వాతి చెప్పారు...

@ జయ : బాగున్నానండీ. ప్రతీ రోజు కాకపోయినా వారానికోక్కసారైనా బ్లాగ్ లో మిమ్మల్నందరినీ పలకరించడానికి వస్తానండీ. మీ అభిమానానికి థాంక్యు సో మచ్.

@ సాయి ప్రవీణ్: బాగున్నానండీ. తప్పనిసరై గాప్ తీసుకోవాల్సి వచ్చిందండీ. ఇకమీదట అంత గ్యాప్ రాకుండా ప్రయత్నిస్తాను.

@ గిరీష్: గిరీష్ గారూ ముందుగా "స్నిగ్ధకౌముది" కి విచ్చేసినందుకు ధన్యవాదాలు. నా మొదటి టపా "స్నిగ్ధకౌముది" పేరు గురించేనండీ. వీలు చూసుకుని చదివి ఎలా వుందో మీ అభిప్రాయం చెప్పండి.

తృష్ణ చెప్పారు...

హలో..బాగున్నారా? రెండు మూడు సార్లు ఇలా వచ్చానండీ...టపాల్లేక వెళ్ళిపోయాను.nice to see you again..:) రాస్తూ ఉండండి.

భాను చెప్పారు...

మీ బ్లాగ్ పేరు బాగుంది స్నిగ్ధకౌముది ..చిక్కని వెన్నెల ఇప్పుడే అఫ్సర్ గారి బ్లాగ్ లో కౌముది కి అర్థం తెలుసుకొని (చంద్ర కాంతి అని ) ఇలా వచ్చేసరికి మీరు కన్పించారు. సంక్రాంతి శుభాకాంక్షలు

మురళి చెప్పారు...

బహుకాల దర్శనం అండీ.. బాగున్నారా? మంచి పాటతో పలకరించారు, బాగుంది..

నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు..

ప్రణీత స్వాతి చెప్పారు...

@ తృష్ణ : తప్పకుండానండీ..ధన్యవాదాలు.

@ భాను : ధన్యవాదాలండీ..

@ మురళీ : బాగానే ఉన్నానండీ. మీక్కూడా రెండు శుభాకాంక్షలు.